ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఫైర్

ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఫైర్

ఎల్‌‌బీ నగర్, వెలుగు: ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట జరిగిపోయినదాన్ని పట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ అడ్డంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్​ అయ్యారు. ‘‘ప్రధాని చేయాల్సిన పని చేయకుండా.. తెలంగాణకు ఇస్తామన్న హామీలు ఇయ్యకుండా.. మాట నిలుపుకోకుండా వ్యవహరిస్తున్నరు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఫార్మా సిటీ పెట్టుకుంటున్నాం.. సాయం చేయండని అడిగితే పైసా కూడా ఇవ్వలేదు” అని మండిపడ్డారు. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో తాగునీటిని అందించేందుకు ఇబ్రహీంపట్నం నియోజ‌‌క‌‌వ‌‌ర్గంలో రూ.134 కోట్లతో చేప‌‌డుతున్న పనుల‌‌కు కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుండా నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని కేటీఆర్​ ఆరోపించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఆటో తోలే అమ్మాయికి సాయం
ఆటో నడుపుతూ ఇంటర్ చదువుతున్న నల్గొండకు చెందిన స్టూడెంట్​ సబితకు మంత్రి కేటీఆర్‌‌ చేయూతనిచ్చారు. బుధవారం ఆమెను ప్రగతి భవన్‌‌కు పిలిపించి డబుల్‌‌ బెడ్రూం ఇంటితో పాటు కొత్త ఆటో ప్రొసీడింగ్స్​ అందజేశారు