రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాల్లో నిర్మించబోయే రైల్వే కోచ్ కర్మాగారానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా రూ.800 కోట్ల వ్యయంతో ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఏడాదికి 500 రైల్వే కోచ్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం అని పేర్కొన్నారు. అనంతరం శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Happy & proud to have broken ground for India’s largest pvt rail coach factory being set up by Medha Group; a Telangana company growing global ?
Production capacity of 500 coaches per year, investment of ₹1000 Cr
A make in Telangana initiative for a Self-reliant India ?? pic.twitter.com/NGjPQmqX9K
— KTR (@KTRTRS) August 13, 2020
