
కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్.. కరీంనగర్ కు ప్రత్యేకంగా ఒక్క పైసా తెచ్చారా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. అభివృద్ధిలో తమతో పోటీ పడాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. చేతనైతే కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు. నాగార్జునసాగర్ లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. యాసంగి పంటల్లో తెలంగాణ నంబర్ వన్ అని చెప్పుకునే విదంగా పంటలు పండుతున్నాయన్నారు. ఈ ఏడాది 6,700 ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. వ్యవసాయం తెలంగాణలో పండుగయ్యిందన్నారు. ఇల్లంతకుంటలో హాస్పిటల్ నిర్మించి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రైవేటు టీచర్లకు 2 వేలు,బియ్యం ఇస్తున్న ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నారా అని అన్నారు.