ప్రతి ఓటరు​ను 25 సార్లు కలవాలి : కేటీఆర్

ప్రతి ఓటరు​ను 25 సార్లు కలవాలి : కేటీఆర్
  •    ఉప్పల్ సెగ్మెంట్​లో జరిగిన బూత్ కమిటీ సభ్యుల 
  •     సమావేశంలో కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం

ఉప్పల్, వెలుగు : బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఓటర్ ను కనీసం 25 సార్లు కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉప్పల్ సెగ్మెంట్ లో జరిగిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.  9 ఏండ్లలో హైదరాబాద్ సిటీ ఎంతో డెవలప్ అయ్యిందన్నారు. హైదరాబాద్ చూస్తే న్యూయార్క్​ను తలపిస్తోందని సెలబ్రిటీలు చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు.

ఉప్పల్ సెగ్మెంట్ లో 5 లక్షలకు పైగా ఓట్లు ఉంటాయని.. కార్యకర్తలు ప్రతి ఓటర్ ను కలవాలన్నారు. మనం ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పాలన్నారు. ఉప్పల్ రోడ్లు బాగు చేశామన్నారు. శిల్పారామం కట్టుకున్నామని ఆయన వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు.