వికారాబాద్‌‌లో  కేటీఆర్‌‌ దిష్టిబొమ్మ దహనం

వికారాబాద్‌‌లో  కేటీఆర్‌‌ దిష్టిబొమ్మ దహనం

వికారాబాద్‌‌, వెలుగు: లోక్‌‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌‌ గాంధీ, సీఎం రేవంత్‌‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం వికారాబాద్‌‌ జిల్లా కేంద్రంలో కేటీఆర్‌‌ దిష్టిబొమ్మను యూత్‌‌ కాంగ్రెస్‌‌ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్‌‌ కాంగ్రెస్‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్‌‌ గౌడ్‌‌, జిల్లా అధ్యక్షుడు సతీశ్​రెడ్డి, వికారాబాద్‌‌ నియోజకవర్గ అధ్యక్షుడు నిఖిల్‌‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.