వికారాబాద్, వెలుగు: జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని వికారాబాద్ ధన్నారంలోని స్వామి వివేకానంద గురుకులంలో శుక్రవారం‘ఫిట్నెస్ స్టార్ ఆఫ్ వికారాబాద్’ పోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి సుమారు 70 మంది విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ శారీరక సామర్థ్యాలు, బలాన్ని ప్రదర్శించారు.ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ సర్టిఫికేట్స్ పంపిణీ చేస్తామని యజ్ఞ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
