ఆల్ టైమ్ రికార్డ్.. భారీగా పతనమైన రూపాయి

ఆల్ టైమ్ రికార్డ్.. భారీగా పతనమైన రూపాయి

రూపాయి విలువ ఆల్ టైం కనిష్ఠానికి చేరుకోవడంతో మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. రూపాయి వాల్యూ రోజురోజుకూ పడిపోతుంటే... ఆర్థిక మంత్రి మాత్రం రేషన్ షాపుల దగ్గర మోడీ ఫోటోలు వెతకడంలో బిజీగా ఉన్నారని సెటైర్ వేశారు. ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం ఇవన్నీ యాక్ట్స్ ఆఫ్ గాడ్ గా చెప్పినా చెప్తారని కేంద్రం తీరుపై ఫైర్ అయ్యారు కేటీఆర్. రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని కేంద్రమంత్రి అంటున్నారని చెప్పుకొచ్చారు.  

81.09కి పడిపోయిన రూపాయి

అమెరికా వడ్డి రేట్లను పెంచినప్పటి నుంచి భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం రూపాయి మారకం విలువపైన కూడా పడింది. మరో 25 పైసలు తగ్గి డాలరుకు రూ. 81.09 గా నమోదైంది.  నిన్న మార్కెట్ ముగిసే టైమ్ రూపాయి విలువ రూ. 80.86గా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 తర్వాత ఒకేరోజు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి.