ట్రాఫిక్, ప్రయాణదూరం తగ్గించేలా లింక్ రోడ్లు

ట్రాఫిక్, ప్రయాణదూరం తగ్గించేలా లింక్ రోడ్లు

హైదరాబాద్ లో ట్రాఫిక్, ప్రయాణదూరం తగ్గించేలా లింక్ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. నగరం అన్ని వైపులా విస్తరిస్తోందన్నారు. అన్ని రంగాల్లో నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. నోవాటెల్ వెనక ఉన్న వసంత్ సిటీ దగ్గర మూడు లింకు రోడ్ల జంక్షన్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ కింద 1800 కోట్ల పనులు చేస్తున్నామన్నారు కేటీఆర్. 313 కోట్ల 65 లక్షలతో 16 రోడ్లు పూర్తి చేశామని తెలిపారు. SRDP పేరుతో బ్రిడ్జిలు, అండర్ పాస్ లు నిర్మిస్తున్నామని... రెండో దశలో మరో రూ.230కోట్లతో 13 రోడ్లు నిర్మాణం జరుగుతోందన్నారు.రోడ్లు మరింత పారదర్శకంగా నిర్మాణం చేపడుతున్నామన్నారు.