టీఆర్ఎస్ తోనే అభివృద్ధి

టీఆర్ఎస్ తోనే అభివృద్ధి
  • టీఆర్ఎస్ తోనే అభివృద్ధి
  • డబుల్ ఇళ్ల కోసం లంచాలు ఇవ్వొద్దు
  • ఖైరతాబాద్‌లో 210 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభం

హైదరాబాద్ : టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం అన్నారు మంత్రి కేటీఆర్. గురువారం ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గంలోని, ఇందిరా నగర్‌లో 210 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నగరం నడిబొడ్డు ఖైరతాబాద్ లో స్థలం దొరకాలంటేనే లక్షల ఖర్చు అవుతుందని.. అలాంటిది ఇళ్లను నిర్మించి ఇచ్చామన్నారు. ఇంత మంచి జాగ మీకు ఎక్కడ దొరకదన్నారు. ఇందిరానగర్‌లో రూ.17.85 కోట్లతో జి+5 అంతస్తులో 5 బ్లాక్‌లలో జీహెచ్‌ఎంసీ డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లను నిర్మించిందన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్న కేటీఆర్.. రోజు రోజుకి హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ల కోసం ఎవ్వరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వకూడదన్నారు. అందరి సమక్షంలోనే లాటరీ విధానంలో డబుల్ ఇళ్లను కేటాయిస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. 

మరిన్ని వార్తలు

ఢిల్లీ రాజ్ ఘాట్ దగ్గర సంజయ్ మౌనదీక్ష

అంబేద్కర్ కంటే గొప్పవాడివా కేసీఆర్ ?

బూస్టర్​ డోస్​ కోసం ఫోన్​ చేస్తే..