ప్రపంచానికే ఇక్కడి నుంచి వ్యాక్సిన్లు సప్లై చేస్తున్నం : కేటీఆర్

ప్రపంచానికే  ఇక్కడి నుంచి వ్యాక్సిన్లు సప్లై చేస్తున్నం : కేటీఆర్

ప్రపంచానికే హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో జీఎమ్ ఆర్ ఇన్నోవెక్స్ సెంటర్ లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్ చైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేటీఆర్..  ఆహారం, వ్యాక్సిన్ లు స్టోరేజ్ చేయడంలో ఈ కోల్డ్  చైన్  ఉపయోగపడుతుందన్నారు. ఫేస్ వన్ లో ఈ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.  

హైదరాబాద్ ఫార్మకు క్యాపిటల్ గా మారిందన్నారు కేటీఆర్. సస్టైనబుల్ కూలింగ్ ప్రమోట్ చేయడమే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.  లాబరేటరీ, కమ్యూనిటీ కూలింగ్ హౌస్ వంటివి కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో  ఏర్పాటు చేస్తున్నామన్నారు.  ఈ తొమ్మిదేళ్లలో వ్యవసాయరంగం ఉత్పత్తి ఎగుమతులు ఎంతో పెరిగాయన్నారు. రైతులు పండించే ఆహార పదార్థాలు వంటివి భద్రపరిచేందుకు కూడా ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.