హైదరాబాద్లోనూ సమస్యలున్నాయి..కానీ! .. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్లోనూ సమస్యలున్నాయి..కానీ!  .. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ లోనూ సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​లోని టీహబ్​లో తెలంగాణ రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు, బీఆర్​ఎస్​ ముఖ్య నాయకులతో కలిసి టీహబ్​లో జరిగే రోబోటిక్స్​ పనితీరును పరిశీలించారు. హైదరాబాద్ సిటీ న్యూయార్క్ ను తలపించేలా మారిపోయిందన్న హీరో రజనీకాంత్, హీరోయిన్ లయ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమెరికా నగరాలలో సమస్యలు ఉండవని అనుకోవడం భ్రమ అని కేటీఆర్ చెప్పారు. అక్కడ ఉండే సమస్యలు అక్కడా ఉంటాయని వివరించారు. 

అంతకు ముందు బేగంపేటలో వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. బేగంపేట శ్యామ్‌లాల్ బిల్డింగ్‌ వద్ద సుమారు రూ.9 కోట్లతో ఆధునిక పద్ధతిలో అతిపెద్ద వైకుంఠధామాన్ని ప్రభుత్వం నిర్మించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనికి సీఎస్‌ఆర్ కింద మీనాక్షి, ఎంఎస్‌ఆర్ సంస్థలు రెండు వైకుంఠ రథాలు విరాళంగా ఇచ్చారని చెప్పారు. మౌలిక వసతుల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం మరింత దృష్టి పెట్టి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నాలాల అభివృద్ధికి రూ.985 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.