అందరికీ సర్కారు కొలువులియ్యలేం : మంత్రి కేటీఆర్

అందరికీ సర్కారు కొలువులియ్యలేం : మంత్రి కేటీఆర్

అందరికీ సర్కారు కొలువులియ్యలేం
ప్రైవేట్ ఇండస్ట్రీస్ ద్వారానే ఉద్యోగాలు సాధ్యం
మహబూబ్​నగర్​పర్యటనలో మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ : తెలంగాణలో అందరికీ సర్కారు కొలువులు ఇచ్చే పరిస్థితి లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలంలో ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్‌ టెక్నాలజీ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌లో మున్సిపల్‌ పార్కు, ఓపెన్‌ జిమ్‌లను ప్రారంభించారు.

ఈసందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ ‘ఐదారు నెలల్లో ఎన్నికలొస్తున్నయ్. ఇక సంక్రాంతి గంగిరెద్దుల్లాగా కాంగ్రెస్ , బీజేపీ నాయకులు గ్రామాల్లోకి వస్తరు. తెలంగాణ జనాభా నాలుగు కోట్లుంటే అందులో సర్కార్​కొలువులు ఆరున్నర లక్షలు మాత్రమే. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే పరిస్థితి ఎక్కడా ఉండదు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ ద్వారానే ఉద్యోగాలు సాధ్యం. స్థానికులు అండగా నిలవాలి. ప్రపంచంలోనే లైఫ్ సైన్సెస్ ఫార్మా సూటికల్స్ కు తెలంగాణ హబ్ గా మారింది. దేవరకద్ర నియోజకవర్గంలో చెరువులు, కుంటలు  90 వేల ఎకరాలకు సాగునీరందుతోంది’ అని కేటీఆర్​ తెలిపారు.