ప్రీతి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి మంత్రి కేటీఆర్

ప్రీతి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి మంత్రి కేటీఆర్

ఇటీవల మృతి చెందిన KMC డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శించి, ఓదార్చారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. మహబుబాబాద్ జిల్లా తొర్రూరులో మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీతి కుటుంబాన్ని కలిశారు. ప్రీతి మృతి అత్యంత బాధాక‌ర‌మ‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌నలు భ‌విష్యత్‌లో జ‌ర‌గ‌కుండా, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ర‌కాల జాగ్రత్తలు తీసుకుంటుంద‌ని చెప్పారు. దోషులు ఎవ‌రైనా స‌రే.. వ‌దిలేది లేదు.. కఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌న్నారు.