ముంబై: విమానం కుప్పకూలిన దుర్ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా ఆరుగురు మృతి చెందిన ఘటనపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. అజిత్ పవార్ ప్రయాణించిన విమానం ఒక ప్రైవేట్ జెట్. Learjet VTSSK/LJ45 అనే ఒక చార్టర్డ్ ప్లైట్. ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
బారామతిలో బహిరంగ సభకు హాజరయ్యేందుకు అజిత్ పవార్ ఈ విమానంలో ముంబై నుంచి బయల్దేరారు. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఈ విమానం కుప్పకూలింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఫ్లైట్ కుప్పకూలి మంటల్లో కాలి బూడిదైంది. అజిత్ పవార్ మాత్రమే కాదు.. మన దేశంలో చాలా మంది పొలిటీషియన్లు ఈ చార్టర్డ్ ఫ్లైట్నే ఎంచుకుంటున్నారని ఈ దుర్ఘటన అనంతరం తెలిసింది.
2023లో కూడా ఇదే విమానం.. ఇలాంటి ఘటనే..
2023లో 8 మంది ప్రయాణికులతో వెళ్తున్న బొంబార్డియర్ లియర్‌జెట్ ప్రైవేట్ జెట్ ముంబై విమానాశ్రయంలో రన్‌వే నుంచి జారిపడి కుప్పకూలింది. 2023, సెప్టెంబర్ 14న సాయంత్రం 5.04 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
#Ongoing a VSR Ventures Learjet 45 [VT-DBL] crashes in Mumbai International Airport (India). First reports state all 8 aboard survived. Video footage shows jet impacting ground apparently while on approach to Runway 27. Updates when possible. pic.twitter.com/DgBx2aNjFp
— Air Safety #OTD by Francisco Cunha (@OnDisasters) September 14, 2023
వైజాగ్-ముంబై VSR ఏవియేషన్ లీర్‌జెట్ 45 విమానం VT-DBL ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ల్యాండ్ అయిన తర్వాత టాక్సీ వే విస్కీ వద్ద రన్‌వే నుంచి జారిపడింది. విమానం కూలిపోవడంతో లోపల మంటలు చెలరేగాయి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
