రాష్ట్రం సాగిస్తున్న ప్రగతి ప్రస్థానం సాక్షిగా.. మీకివే మా నివాళులు

రాష్ట్రం సాగిస్తున్న ప్రగతి ప్రస్థానం సాక్షిగా.. మీకివే మా నివాళులు

తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొఫెస‌ర్ జయశంకర్ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య జయశంకర్ ను స్మరించుకుంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. జయశంకర్ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన గడిపిన జీవితం మహోన్నతమని కేటీఆర్ కొనియాడారు. 

తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా
మీరు నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకం..
మీరు గడిపిన జీవితం మహోన్నతం..
స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న
ప్రగతి ప్రస్థానం సాక్షిగా.. మీకివే మా నివాళులు
జోహార్ Prof. జయశంకర్ సార్ ... అంటూ జయశంకర్ చేసిన సేవలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

అంతే కాకుండా జయశంకర్ తో ఉద్యమ సమయంలో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. ఇది తనకు నచ్చిన ఫొటోలలో ఒకటిగా పేర్కొన్నారు. నవంబర్29, 2009లో హన్మకొండలో జయశంకర్ ఇంట్లో తామిద్దరూ కలిసి ఉద్యమంలో పాల్గొన్న ఒక ఫొటోను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ ను అరెస్ట్ చేసి ఖమ్మం జైళ్లో పెట్టారని, తననేమో వరంగల్ జైలుకు తరలించారని కేటీఆర్ ఈ ట్వీట్ ద్వారా తెలిపారు.