గాడ్సే భక్తులు గాంధేయ మార్గంలో ఎలా నడుస్తారు?

గాడ్సే భక్తులు గాంధేయ మార్గంలో ఎలా నడుస్తారు?

హైదరాబాద్: బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో కలసి జీహెచ్‌ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజా ఆస్తిని ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు, నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గాడ్సే భక్తులు గాంధేయ మార్గంలో నడుస్తారని భావించడం అత్యాశే అవుతుందన్నారు. 

కాగా, జీహెచ్ఎంసీ నుంచి తమ కార్పొరేషన్లకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మేయర్ హటావో అంటూ బల్దియా హెడ్ ఆఫీసులో బీజేపీ కార్యకర్తలు పోస్టర్లను అతికించారు. కార్పొరేటర్లతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఆఫీసులోకి చొచ్చుకొచ్చారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తల కోసం: 

మోడీని కలవకుండానే హైదరాబాద్ కు కేసీఆర్!

మార్చి వరకు ఉచిత రేషన్ బియ్యం