బీబీసీపై ఐటీ రైడ్స్.. స్పందించిన కేటీఆర్

బీబీసీపై ఐటీ రైడ్స్.. స్పందించిన కేటీఆర్

ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో ఐటీ దాడులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వాట్‌ ఏ సర్‌ ప్రైజ్‌ అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్... మోడీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీపై ఐటీ దాడులు జరిగాయన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ తదితర సంస్థలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని  ఆరోపించారు. వాట్ నెక్ట్స్‌ అన్న కేటీఆర్‌.. హిండెన్‌ బర్గ్‌పై ఈడీ దాడులు ఉంటాయా లేకా టేకోవర్ చేసుకుంటారా అని సటైరిక్ గా ట్వీట్ చేశారు.  

గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఇ టీవల ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. గుజరాత్ మత అల్లర్ల నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ  తీయగా ఇండియాలో ఈ ప్రదర్శనపై కేంద్రం నిషేదం విధించింది. ఈ నేపథ్యంలో బీబీసీ ఆఫీసుల్లో ఐటీ దాడులు  జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది కేవలం సర్వే అని.. సోదాలు కాదని ఐటీ అధికారులు వెల్లడించారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.