
- 600 గజాలు దాటిన అన్ని నిర్మాణాలకు తప్పనిసరి
- కూల్ రూఫ్ పాలసీ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్
- తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీ ఆవిష్కరణలో కేటీఆర్
హైదరాబాద్, వెలుగు : కూల్ రూఫ్ పాలసీ పరిధిలో ఉన్న నిర్మాణాలకే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇస్తామని, 600 గజాలు దాటిన అన్ని నిర్మాణాలకు ఇది వర్తిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఒక మీటర్ కూల్రూఫింగ్కు రూ.300 మించి ఖర్చవదని, బిల్డర్లు ముందే ప్లాన్ చేసుకుంటే ఇంతకన్నా తక్కువతోనే పూర్తి చేయవచ్చని అన్నారు. ఇప్పటికే నిర్మించిన ఇండ్లు, కమర్షియల్ బిల్డింగులకు కూల్రూఫింగ్(రెట్రో ఫిట్టింగ్) చేయించుకోవాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023–28ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 600 గజాల్లోపు నిర్మాణాలు చేసేవారు కూల్రూఫింగ్ఖర్చును కరెంట్బిల్లు ఆదా రూపంలో రెండేండ్లలో రాబట్టుకోవచ్చన్నారు. తమ ఇంటికీ కూల్రూఫింగ్ చేయించుకున్న తర్వాతే మిగతావాళ్లు చేయాలని చెప్తున్నానన్నారు. ఒకప్పుడు గూన పెంకులు, డంగు సున్నంతో నిర్మాణాలు చేసేవారని.. ఇప్పటికీ పెద్ద పెద్ద ప్యాలస్‌లకు వెళ్తే ఎంతో చల్లగా ఉంటుందన్నారు. వేగంగా నిర్మాణాలు చేయాలని వేడిని ఆకర్షించే స్టీల్, సిమెంట్, ఇతర మెటీరియల్, వందల అంతస్తుల వల్లే హీట్పెరుగుతోందన్నారు.
జనాల మైండ్‌సెట్ అట్లనే ఉంటది
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఈ పాలసీని ఇప్పుడు రిలీజ్చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. 2018లో వనస్థలిపురంలోని ఈస్ట్ఆనంద్బాగ్లో వరదలు వచ్చి ఇండ్లు మునిగిపోయాయని, అప్పుడు నాలా వెడల్పు చేయాలని డిమాండ్చేసినోళ్లే రెండు నెలల తర్వాత 300 ఇండ్లు తొలగిస్తామంటే వద్దన్నారని, జనాల మైండ్సెట్అలాగే ఉంటుందన్నారు. వాస్తు అంటే కొందరు మూఢనమ్మకం అనుకుంటారని, కానీ కేసీఆర్ వాస్తును నమ్ముతారని, వాస్తు కాన్సెప్ట్ లో సైంటిఫిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని అన్నారు.
కేంద్రం, ఇతర రాష్ట్రాలు మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు సహా మన స్కీంలు కాపీ కొట్టాయని, కూల్రూఫ్పాలసీలో మనం టార్గెట్ రీచ్ అయితే రేపు దేశం మొత్తం ఆచరిస్తుందన్నారు. ఓట్లు సీట్ల కోసం ఈ పాలసీ తేవడం లేదని, భవిష్యత్తరాలకు మంచి చేయడానికే తీసుకువస్తున్నామని అన్నారు. 2030 నాటికి హైదరాబాద్ లో 200 కి.మీ., మిగతా నగరాల్లో 100 కి.మీ.లలో కూల్రూఫింగ్ అమలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తం
ప్రభుత్వం నిర్మించే డబుల్బెడ్రూం ఇండ్లు, సైక్లింగ్ ట్రాక్ లు, పేవ్ మెంట్లకు కూల్ పెయింట్స్వేయిస్తామని కేటీఆర్ చెప్పారు. వాతావరణ కాలుష్యం నియంత్రించేందుకు హైదరాబాద్ లో 500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నామని, ప్రజలు కూడా ఎలాక్ట్రిక్ వెహికల్స్ వాడేలా ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ మధ్య మనుషులు సడెన్‌గా చనిపోతున్నారని, అందువల్ల ప్రతి అపార్ట్మెంట్, కమ్యూనిటీలో సీపీఆర్‌పై అవగాహన కల్పించే బాధ్యత జీహెచ్ఎంసీ, మున్సిపల్అధికారులు తీసుకోవాలన్నారు.
కూల్‌రూఫ్ పాలసీ అమలు చేసే వాళ్లకు ఇంటెన్సివ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కూల్రూఫ్పాలసీతో పట్టణాలు, నగరాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గించవచ్చని ప్లక్ష యూనివర్సిటీ(చండీగఢ్) ప్రొఫెసర్విశాల్గార్గ్తెలిపారు. ఆయనతోపాటు కూల్ రూఫ్ ఎడ్యుకేటర్ నీతూ జైన్ ప్రజంటేషన్లు ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్గద్వాల్విజయలక్ష్మి, ఎంఏయూడీ స్పెషల్సీఎస్అర్వింద్కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్లోకేశ్కుమార్తదితరులు పాల్గొన్నారు.