భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం ఏడుగురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఉధంతి ఏరియా కమిటీ కమాండర్ సునీల్, కార్యదర్శి అరీనాతో పాటు కమిటీ సభ్యులు లుడ్రాన్, విద్య, నందిని, మల్లేశ్, మరో సభ్యుడు ఉన్నారు. ఎస్‌ఎల్‌ఆర్, మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఒక సింగిల్ షాట్ వెపన్‌ను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో ఒక్కొక్కరిపై రూ.8 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
కర్రెగుట్టలో జవాన్‌పై ఎలుగుబంటి దాడి
ఛత్తీల్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో శుక్రవారం కూంబింగ్‌కు వెళ్లిన జవాన్ కన్నపై ఎలుగుబంటి దాడి చేసింది. జవాన్ కూంబింగ్ చేస్తుండగా.. పొదల చాటు నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఎలుగుబంటి దాడి చేయడంతో జవాన్ కాలుకు తీవ్రగాయమైంది. గమనించిన తోటి జవాన్లు ఎలుగుబంటిని తరిమేసి, గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ హాస్పిటల్‌కు తరలించారు.
