‘పెదకాపు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ పిక్చర్స్, ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వేసిన శివాలయం సెట్‌లో గణేశ్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీలో విరాట్ కర్ణపై ‘ఓం వీర నాగ’ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.
ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ ఈ సెట్‌ను డిజైన్ చేయగా, అభే, జునైద్ కుమార్ సాంగ్ కంపోజ్ చేశారు. శ్రీ హర్ష లిరిక్స్ రాశాడు. ఈ డివోషనల్ సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని మేకర్స్ చెప్పారు. మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంలో సాగుతుంది. కథ, పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో ఉంటుంది.
