కేంద్రం దొగొచ్చింది.. కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటది: కేటీఆర్

కేంద్రం దొగొచ్చింది.. కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటది: కేటీఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణను విరమించుకుందని  కేంద్రం ప్రకటించడం  సీఎం కేసీఆర్ ఘనతేనని  మంత్రి కేటీఆర్ అన్నారు.   వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం చెబితే ..ఎలా చేస్తారో చూస్తామని కేసీఆర్ గట్టిగా మాట్లాడారని.. అధ్యయనం కోసం  సింగరేణిని ఏపీకి పంపిస్తామని ఒక్క మాట అనగానే  కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు.  వెంటనే  కేంద్రమంత్రి విశాఖ ఉక్కుపై ప్రకటన చేశారని..  కేసీఆర్ దెబ్బ అంటే అట్లుంటదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని  కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్  స్పష్టం చేశారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్. దాని కంటే ముందు అర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని వెల్లడించారాయన. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. వీటిపై అర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పారాయన. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమేనని.. ఇందులో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు కేంద్ర సహాయ మంత్రి. దీని ద్వారా ప్రయివేటకరణ నిర్ణయం ప్రస్తుతానికి నిలిచినట్లుగా భావిస్తున్నామన్నారు. ప్రైవేటీకరణ ఆలోచనపై ప్రస్తుతం ముందుకు వెళ్లటం లేదని కేంద్ర సహాయ మంత్రి చెప్పటం ద్వారా స్టీల్ ప్లాంట్ కార్మికులకు, రాజకీయ పార్టీలకు బిగ్ రిలీఫ్ గా మారింది.