ఇన్నోవేషన్లతో అద్భుతాలు సృష్టించాం: మంత్రి కేటీఆర్​

ఇన్నోవేషన్లతో అద్భుతాలు సృష్టించాం: మంత్రి కేటీఆర్​

హైదరాబాద్​, వెలుగు: ప్రభుత్వ విధానాల్లో ఇన్నోవేషన్లకు, కొత్తదనానికి పెద్దపీట వేయడం ద్వారా ఎన్నో విజయాలు సాధించామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్​ అన్నారు. ఇలాంటి విధానాల వల్లే తెలంగాణ మోడల్​విజయవంతమైందని చెప్పారు. టీఎస్ ​ఐపాస్​, ఆన్​లైన్ బిల్డింగ్​ పర్మిషన్​ వంటివి ఇందుకు ఉదాహరణలని వివరించారు. హైదరాబాద్​ లో శుక్రవారం ఎఫ్​టీసీసీఐ ఎక్స్​లెన్స్​ అవార్డులను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు, వైఎస్​ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలు అనుసరించిన రైతు, గ్రామీణ, సంక్షేమ, పట్టణాభివృద్ధి, అభివృద్ధి అనుకూల విధానాలను కేసీఆర్​ సర్కారు కూడా అమలు చేస్తోందన్నారు. రాబోయే సంవత్సరంలో ప్రపంచానికి అవసరమయ్యే వ్యాక్సిన్లలో సగం హైదరాబాద్​లోనే తయారు కాబోతున్నాయని కేటీఆర్​ చెప్పారు. ఎలక్ట్రిసిటీ బిల్స్​కు వన్​ టైమ్​సెటిల్​మెంట్ సదుపాయం కల్పించాలని, ట్రేడ్​లైసెన్స్​ సిస్టమ్​ను వెనక్కి తీసుక్కోవాలంటూ ఎఫ్​టీసీసీఐ ప్రెసిడెంట్​ అనిల్​ అగర్వాల్​ చేసిన రిక్వెస్ట్​కు స్పందిస్తూ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీటిపై చర్చించడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

అవార్డులను అందజేసిన మంత్రి 

 తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్​టీసీసీఐ) ఫెడరేషన్ ప్రకటించిన ఎక్సలెన్స్ అవార్డులను 22 కంపెనీల ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి అందజేశారు. పారిశ్రామిక ఉత్పాదకతలో ఉత్తమ కంపెనీగా --వసంత్ టూల్ క్రాఫ్ట్స్,  అత్యుత్తమ పనితీరు గల కంపెనీగా --మహీంద్రా & మహీంద్రా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో విభాగంలో- -కరణ్ మసాలాలు, మార్కెటింగ్ ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  --క్లౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టల్ టెక్నాలజీ సొల్యూషన్స్ లిమిటెడ్​, ఎగుమతుల్లో -నవా లిమిటెడ్, ఎగుమతి పనితీరు విభాగంలో --హన్స్ ప్రొడక్ట్స్​, న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్/అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విభాగంలో -విండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రీమ్ ఎనర్జీ టెక్నాలజీస్  , ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఇనీషియేటివ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఎన్​సీఎల్​ ఇండస్ట్రీస్ ,   ప్రొడక్ట్ ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో --శివనారాయణ్ జ్యువెలర్స్, ప్రొడక్షన్​ ఎక్సలెన్స్ విభాగంలో రోబోటిక్స్ ప్రైవేట్  లిమిటెడ్,  ఆరోగ్య సంరక్షణలో రెలిసిస్ మెడికల్​ డివైజెస్​,  ఏరోస్పేస్  డిఫెన్స్ పరిశ్రమకు అత్యుత్తమ సహకారం అందించిన కంపెనీగా-- ఎంక్యూఎస్​ టెక్నాలజీస్,  ఐటీలో ఆదర్శ్ కో-–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, టూరిజం ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో రామోజీ ఫిల్మ్ సిటీతోపాటు మరికొన్ని  కంపెనీల ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు. ఏఐజీ హాస్పిటల్స్ సీఎండీ​ నాగేశ్వర రెడ్డి మంత్రి చేతుల మీదుగా లైఫ్​టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డు తీసుకున్నారు.