ఏ రాష్ట్రంలో రైతులకు లాభాల పంట పండిందో చూపించాలి

ఏ రాష్ట్రంలో రైతులకు లాభాల పంట పండిందో చూపించాలి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఎంత మంది రైతుల ఆదాయం రెట్టింపు చేసిందో ఆ వివరాలు బయట పెట్టాలని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌ ప్రశ్నించారు. ప్రధాని మోడీ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని ఎంతో మంది రైతుల ఆదాయం డబుల్‌‌‌‌ అయ్యిందని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారిక ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొనడంతో దానికి కేటీఆర్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ ఇచ్చారు. కేంద్రం చెప్తున్నది నిజమే అయితే, దానికి సంబంధించిన వివరాలను దేశ ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌‌‌‌ చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

ఏ రాష్ట్రంలో రైతులకు లాభాల పంట పండిందో చూపించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. వ్యవసాయ శాఖ ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో పెట్టిన ఫొటోలో ఉన్నది నిజమైన రైతు కాదని, ఒక మోడల్‌‌‌‌ అని నెటిజన్లు చెప్తున్నారని, నిజంగానే రైతుల ఆదాయాన్ని డబుల్‌‌‌‌ చేసి ఉంటే అసలైన రైతులతోనే చెప్పించాలి కదా అని ఆయన ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని రోడ్లపైకి వచ్చిన దేశ ప్రజలను ప్రధాని మోడీ ‘ఆందోళన్‌‌‌‌ జీవి’అన్నారని, ఓ కేంద్ర మంత్రి ‘గోలీ మారో సాలోంకో’అని భావోద్వేగాలను రెచ్చగొట్టారని గుర్తుచేశారు.