
పెట్టుబడులకు తెలంగాణ కేరాఫ్ అన్నారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న డ్రిల్ మెక్ సంస్థకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. హైదరాబాద్ లో గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనుంది డ్రిల్ మెక్ సంస్థ. దీనికి సంబంధించి రాష్ట్ర సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రిల్ మెక్, తెలంగాణ ప్రభుత్వం మధ్య బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో MoU ఒప్పంద కార్యక్రమం జరిగింది. 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో హైదరాబాద్ లో గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనుంది. డ్రిల్ మెక్ ఏర్పాటుతో కొత్తగా 2,500 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ డ్రిల్‌మెక్. తెలంగాణ కేంద్రంగా భారీ ఆయిల్ రిగ్గులను తయారు చేయనుంది డ్రిల్ మెక్ సంస్థ. ఆయిల్ రిగ్గుల తయారీలో అంతర్జాతీయ స్థాయి సంస్థగా డ్రిల్ మెక్ ఎదిగింది.
గత ఏడున్నరేళ్లలో కేంద్రం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదన్నారు కేటీఆర్. కనీసం ఈ బడ్జెట్ లో ఆయినా విభజన హామీలు అమలు చేయాలి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు కేటీఆర్. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ కు స్పెషల్ ఇండస్ట్రియల్ రాయితీలు అందించాలన్నారు. తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్ట్ పార్క్, ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదన్నారు. ప్రధానమంత్రి మోదీ పదే పదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారు... రాష్ట్రాలకు నిధులు విధుల్చకపోతే ఎలా సాధ్యమవుతుంది.? అని కేటీఆర్ ప్రశ్నించారు. భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కేంద్రం సహకరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరమన్నారు. మా హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు డ్రిల్ మెక్ ని ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
భీమ్లా నాయక్ సినిమాపై వర్మ సంచలన ట్వీట్లు
సిటీలో పెరుగుతున్న హోమ్ ఫుడ్ స్టోర్లు