ఉద్యోగాలిస్తం.. ప్రతిపక్షాల నోర్లు మూస్తం

ఉద్యోగాలిస్తం..  ప్రతిపక్షాల నోర్లు మూస్తం

ఈటెల రాజేందర్ చివరి వరకు పార్టీలో ఉండాలని తాను ప్రయత్నించినట్లు చెప్పారు మంత్రి కేటీఆర్. ఈటల రాజేందర్ సీఎంను కలవనని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తాను ఎమిచేయగలరనన్నారు. ఈటల రాజేందర్ పార్టీలోకి రాకముందు కూడా కమలాపురం బలంగానే ఉందని.. ఇప్పుడు కూడా హుజురాబాద్ బలంగానే ఉందన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎమిచ్చిందని ప్రశ్నించారు కేటీఆర్. జల జీవన్ మిషన్ కింద అన్ని రాష్ట్రాలకు నిధులిస్తుందని.. కానీ తెలంగాణకు ఇవ్వటం లేదన్నారు.

టీఆరెస్ అభివృద్ధిని.. బీజేపీ ఖాతాలో ఈటెల ఎలా వేసుకుంటారని ప్రశ్నించారు కేటీఆర్. హుజురాబాద్ లో పోటీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధే కానీ వ్యక్తుల మధ్య కాదన్నారు మంత్రి కేటీఆర్. హుజురాబాద్ లో పార్టీనే అభ్యర్థని చెప్పారు. హుజూరాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనేనన్నారు. హుజురాబాద్ నియోజక వర్గానికి బీజేపీ ఏమి చేసిందో ఈటెల చెప్పాలన్నారు. 

ఈసీజన్లో అందరూ వ్రతాలు పూజలు చేసినట్లు షర్మిల ఓ రోజు పెట్టుకుని వచ్చిపోతుంటారని వ్యంగ్యంగా బదులిచ్చారు కేటీఆర్. వచ్చే రెండుమూడు నెలలు రాజకీయాలు రంజుగా ఉంటాయన్నారు. ఏపీ జల వివాదాలపై  సుఫ్రీంకోర్టుకు వెళ్లినా న్యాయం తెలంగాణ వైపే ఉందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల ఇష్యూ క్లియర్ అయితే ప్రతిపక్షాలకు విమర్శించే టాపిక్ ఉండదన్నారు కేటీఆర్.