పవన్ హన్స్ వాటాల అమ్మకంపై అనుమానాలున్నయ్

పవన్ హన్స్ వాటాల అమ్మకంపై అనుమానాలున్నయ్

పవన్ హన్స్ కార్పొరేషన్ లో వాటాల అమ్మకంపై అనుమానాలున్నాయంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న పవన్ హాన్స్ విలువ 2017లో 3 వేల 7 వందల కోట్లుగా ఉందన్నారు. అందులో 49 శాతం వాటాను కేవలం 211 కోట్లకు అమ్మడం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. NPA గవర్నమెంట్ దీనిపై ఏం సమాధానం చెబుతుందని ట్విట్టర్ లో ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న పవన్ హన్స్ లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఇటీవలే ముగించింది కేంద్రం. పవన్ హన్స్ కార్పొరేషన్ లో కేంద్ర ప్రభుత్వానికి 51 శాతం, ONGCకి 49 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వ వాటాగా ఉన్న 51 శాతం వాటాను 211 కోట్లకు స్టార్ నైన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది.