జీఎస్టీ పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనం

జీఎస్టీ పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనం

హైదరాబాద్ : టెక్స్టైల్ పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమకు మరణశాసనమని అన్నారు. టెక్స్ టైల్ పై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచడం సరికాదని కేటీఆర్ ట్వీట్ చేశారు. మేకిన్ ఇండియా అని ఉపన్యాసాలు ఇచ్చే మోడీ వస్త్ర పరిశ్రమను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్వదేశంలో వస్త్ర తయారీకి సహకారం అందించాలని కోరారు. ఈ విషయంలో మోడీ జోక్యం చేసుకుని చేనేత కార్మికులను కాపాడాలని అన్నారు.

మరిన్ని వార్తల కోసం

వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.150 కోట్లు స్వాధీనం

మరో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ