వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.150 కోట్లు స్వాధీనం

వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.150 కోట్లు స్వాధీనం

కాన్పూర్ : ఉత్తర్ప్రదేశ్లో ఓ వ్యాపారవేత్త ఇంట్లో ఇన్కం టాక్స్, జీఎస్టీ అధికారులు చేసిన దాడుల్లో భారీగా నగదు పట్టుబడింది. పర్ఫ్యూమ్ వ్యాపారం చేసే పీయూష్ జైన్ ఇంట్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు. తనిఖీల్లో ఇప్పటి వరకు దాదాపు 150 కోట్ల నగదు పట్టుబడింది. గుట్టలు గుట్టలుగా బయటపడిన నగదు లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ శనివారం ఉదయానికి పూర్తవుతుందని సమాచారం. ఇన్కం ట్యాక్స్ సిబ్బంది గుట్టల కొద్దీ నగదును లెక్కపెడుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో కాన్పూర్ తో పాటు గుజరాత్, ముంబైలోని పీయూష్ జైన్ నివాసాలపై ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. మరోవైపు జీఎస్టీ అధికారులు సైతం ఆయన వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఫేక్ ఇన్వాయిస్ లు, తప్పుడు అప్పుల లెక్కలు చూపించడంతోనే సోదాలు నిర్వహిస్తున్నట్లు సీబీఐసీ ఛైర్మన్ వివేక్ జోహ్రీ ప్రకటించారు. ఇన్వాయిస్ లు, వే బిల్లులు లేకుండానే మెటీరియల్ సప్లై చేస్తున్నట్లు ఎంక్వైరీలో తేలినట్లు చెప్పారు. అధికారులు ఇప్పటి వరకు దాదాపు 200 ఫేక్ ఇన్వాయిస్ లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆన్లైన్ పెళ్లికి హైకోర్టు అనుమతి

ఎడారిలో ఒంటెపై వెళ్లి వ్యాక్సినేషన్ 

వనస్థలిపురంలో కరోనా చిల్డ్రన్ వార్డ్