
వరల్డ్ హార్డ్ డే సందర్భంగా నిర్వహించిన సైక్లింగ్ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని, స్టెప్పులేశారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ లోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో చేపట్టిన సుచిత్ర డెకాథ్లాన్ లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండె, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ సుమారు 4000 మంది మెడికల్ విద్యార్థులు, యువకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను వివరిస్తూ సైకల్ మీద సుచిత్ర డెకథ్లాన్ నుండి సినీ ప్లానెట్ వరకు సైకల్ మీద ప్రయాణం చేశారు. అనంతరం వేదిక మీద ఆట, పాడి యువతలో ఉత్సాహం నింపారు. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి నృత్యం చేసే అందర్నీ ఉత్తేజపరిచారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని, గుండె సంబంధించిన వ్యాధుల నుండి ఎలా రక్షించుకోవాలో, ఎలా కాపాడుకోవాలో చక్కగా వివరించిన వైద్యులకు కృతజ్ఞతలు అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. విశ్వసనీయమైన, అనుభవజ్ఞులైన వైద్యులచే, ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మల్లారెడ్డి హెల్త్ సిటీ ఛైర్మన్ డా. భద్రారెడ్డి చెప్పారు. ఈ సైకిల్ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి హెల్త్ సిటీ ఛైర్మన్ డాక్టర్ భద్రారెడ్డితో పాటు 2000 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యంతో పాటు డెకాథ్లాన్, బై సైక్లింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, మ్యాజిక్ 106.4, సేవ్ ది యంగ్ హార్ట్ ఫౌండేషన్, ఫిటినెస్ 9 సంస్థల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు.