యాదాద్రికి మంత్రి మల్లారెడ్డి 3 కిలోల బంగారం విరాళం

V6 Velugu Posted on Oct 28, 2021

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం స్వర్ణ తాపడం పనుల కోసం మంత్రి మల్లారెడ్డి భూరి విరాళాన్ని అందించారు. ఇవాళ(గురువారం)ఆయన కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ కార్యకర్తలతో కలిసి గుట్టకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డికి ఆలయ ఈవో గీత, అర్చకులు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత 3 కేజీల బంగారానికి సరిపడ డబ్బు విరాళంగా అందజేశారు.

సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి క్షేత్ర పునర్‌నిర్మాణంలో తాను కూడా పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు మల్లారెడ్డి. మేడ్చల్ నియోజకవర్గం తరపున మూడు కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. తన కుటుంబం తరపున కిలో బంగారం.. నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ తరపున 2 కిలోల బంగారం సమర్పించినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మంత్రి మల్లారెడ్డి మొత్తం రూ. 1.75 కోట్ల నగదు అందించారు. ఇందులో రూ. కోటి నగదు కాగా, రూ. 75 లక్షల విలువైన చెక్కులు ఉన్నాయి.

Tagged Minister Malla Reddy, Yadadri , donated, 3 kg gold

Latest Videos

Subscribe Now

More News