రేవంత్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం

రేవంత్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావాలనే తనపై దాడి చేసేందుకు కుట్ర చేశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. అవకాశం కోసం ఎదురుచూసి రెడ్డి సింహ గర్జన సభలో రెడ్డిల ముసుగులో గూండాలను పంపించి తనను చంపేందుకు ప్లాన్ చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గత ఎనిమిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని..అతని టార్చర్ తట్టుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపానని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టనని మల్లారెడ్డి స్పష్టం చేశారు. తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే రెడ్డి సభకు గూండాలను పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కుట్రలు, నేరాలన్నీ బయటకు తీసి జైల్లో పెడుతామన్నారు.

రెడ్డి సింహగర్జన సభకు తానే పర్మీషన్ ఇప్పించానని చెప్పిన మల్లారెడ్డి..రెడ్ల ముసుగులో రేవంత్ రాజకీయ పంచాయతీ చేస్తున్నారని ధ్వజమొత్తారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారన్నారు. నాయిని నర్సింహారెడ్డి చొరవతో రెడ్డి కార్పొరేషన్ ముందుకు కదిలిందన్నారు. రెడ్లలో 70 శాతం మంది పేదలే ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. రెడ్డి రైతులకు దళిత బంధు, రైతు భీమా, పింఛన్ అన్నీ అందుతున్నాయన్నారు. 


సీఎం కేసీఆర్ చొరవతో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు కోటి ఎకరాలను సాగు నీరు అందించామన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. దళితులను అభివృద్ధి చేసేందుకు దళిత బంధు తీసుకొచ్చామన్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే  రేవంత్ రెడ్డి కుట్రలు పన్ని రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. రేవంత్ కు వాల్యూ లేదు, తోపు అని చెప్పుకుంటున్నాడన్నారు.

మరిన్ని వార్తల కోసం

లాల్ సింగ్ చద్ధాలో అమీర్ ఎమోషనల్ జర్నీ

ఐపీఎల్-15 ప్రైజ్ మనీ.. రికార్డులు