బీఆర్ఎస్ నేతలు పేకాటలో దొరికింది నిజమే : మల్లారెడ్డి

బీఆర్ఎస్ నేతలు పేకాటలో  దొరికింది నిజమే : మల్లారెడ్డి

పేకాట ఆడుతూ కొందరు బీఆర్ఎస్ నేతలు దొరికింది వాస్తవమేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. బీఆర్కే  భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మన్సిపాలిటీల్లో అవిశ్వాసాలు గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు. తాండూరు, వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్స్ కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి వలసలు ఆగిపోయాయని.. ఇతర దేశాలకు వెళ్లిన వారు తిరిగొస్తున్నారని అన్నారు.

బీజేపీ జూటా పార్టీ అని అందులోని వారంతా జూటా నేతలని మల్లారెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. వారికి భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. కేంద్రం లక్షల కోట్ల ఎఫ్డీలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టిందని, ఇపుడు అదాని షేర్లు కొన్న వాళ్లు తలలు పట్టుకుంటున్నారని అన్నారు.