
సీఎం కేసీఆర్ పెద్దపల్లి పర్యటన మంత్రి మల్లారెడ్డికి నిరాశ మిగిల్చింది. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వెళ్తున్న సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం పలకాలనుకున్న మంత్రి.. దాని కోసం ప్రత్యేక కార్యక్రమమే ఏర్పాటు చేశారు. శామీర్ పేట రాజీవ్ రహదారిపై గల కట్టమైసమ్మ ఆలయ వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటుచేసి ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు వివిధ కార్యక్రమాలతో హడావుడి చేశారు.
సుమారు ఐదున్నర గంటలపాటు రాజీవ్ రహదారిని గులాబీమయం చేశారు. అయితే చివరకు సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ ద్వారా వెళ్లాడని తెలసుకుని నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటివరకు ఆనందోత్సవాల మధ్య హంగామా చేసిన నాయకుల నిరాశగా వెనుదిరిగారు. కాగా సీఎం కేసీఆర్ పెద్దపల్లిలో పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ సహా టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.