కాంట్రాక్టు లెక్చరర్లకు నెలనెలా జీతాలిస్తం : విద్యాశాఖ మంత్రి సబిత

కాంట్రాక్టు లెక్చరర్లకు నెలనెలా జీతాలిస్తం : విద్యాశాఖ మంత్రి సబిత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంట్రాక్టు లెక్చరర్లకు నెలనెలా వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసు కుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీనిపై ఆర్థిక మంత్రి హారీశ్​రావు రెండ్రోజుల కిందట అధికారులతో సమీక్షించా రని, త్వరలోనే విధివిధానాలు  ఖరారు చేస్తామని చెప్పారు. గురువారం కాంట్రాక్టు లెక్చరర్స్‌‌ అసోసియేషన్‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేశ్‌‌, అధ్యక్షుడు రమణారెడ్డి నేతృత్వం లోని ప్రతినిధి బృందం మంత్రి సబితను కలిశారు. మూడు నాలుగు నెలలకోసారి జీతాలు వస్తున్నాయ ని.. నెలనెలా ఇప్పించాలని కోరారు. జాబ్ సెక్యూరిటీ కల్పించాలని, సీఎల్​లు పెంచాలని విజ్ఞప్తి చేశారు.