
పరకాలలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీర్చి దిద్దాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. కొరియా పర్యటనకు వెళ్ళినప్పుడు టెక్స్ టైల్స్ పై అక్కడి కంపెనీలతో మాట్లాడామని, టెక్స్టైల్ పార్క్ ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామని అన్నారు.
టెక్స్టైల్ పార్కును ప్రపంచంలోనే రోల్ మోడల్ గా చేస్తామని, టెక్స్టైల్ పార్క్ కోసం కొరియా ట్రిప్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద కంపెనీలతో చర్చించారని అన్నారు. త్వరలోనే కొరియా కంపెనీల ప్రతినిధులు టెక్స్టైల్ పార్కు సందర్శన కు వస్తారని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ బాధిత రైతులకు నష్టపరిహారం ఇచ్చి భరోసా కల్పిస్తుందని అన్నారు.