ధరణి వల్లే బీఆర్ఎస్ కొంప మునిగిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ధరణితో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డా.. ఇంకా బీఆర్ఎస్ నేతలకు సిగ్గు రాలేదని విమర్శించారు. అసెంబ్లీలో నిస్సిగ్గుగా ఇంకా ధరణిని సమర్ధించు కుంటున్నారని విమర్శించారు పొంగులేటి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొన్నారు పొంగలేటి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. రైతును రాజు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందన్నారు.
Also Read :- లక్షల కోట్ల అప్పులు చేసి అవతల పడ్డరు
ప్రభుత్వ భూముల్లో సాగు చేసే వారి వివరాలు సేకరించాలని కలెక్టర్ కు ఆదేశించారు పొంగులేటి. త్వరలోనే సాగుచేసే అర్హులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. రానున్న నెల రోజుల్లో 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని మీ గుమ్మానికి చేరుస్తామని చెప్పారు.