మాది నియంత పాలన కాదు..ప్రజాపాలన: పొన్నం ప్రభాకర్

మాది నియంత పాలన కాదు..ప్రజాపాలన: పొన్నం ప్రభాకర్

ఉద్యమకారుల ఆకాంక్షలు అమలుచేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ  లక్ష్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.  ఆనాడు 12 మంది ఎంపీలు పార్లమెంట్ లో  పోరాడకపోతే  తెలంగాణ వచ్చేది కాదన్నారు.  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడటమే తమ లక్ష్యమని చెప్పారు. పదేళ్ళలో అమరవీరుల కుటుంబాలు వంచించ బడ్డాయన్నారు.  తెలంగాణ అభివృద్ధి సాధనలో వారందరినీ భాగస్వామ్యం చేస్తామన్నారు.  గత పదేళ్లలో కాకతీయ ఉత్సవాల ఊసేలేదన్నారు. తమ ప్రభుత్వం ఈ సంవత్సరం గౌరవంగా కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

తమది నియంత పాలన కాదు.. ప్రజాపాలన అని అన్నారు. దమ్ముతో పోరాడి సాధించాం పాలిస్తామని చెప్పారు. భారత ప్రధాని తెలంగాణ ఏర్పాటును అవహేళన చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఓ చరిత్ర అని అన్నారు. ఇప్పుడు ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఉద్యమకారులకు సముచిత స్థానం ఉంటుందన్నారు.