త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు: మంత్రి పొన్నం

త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు: మంత్రి పొన్నం

హైదరాబాద్: త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2017,2021 పీఆర్సీ పెండింగ్ బిల్స్ పై చర్చిస్తున్నామన్నారు. రాష్ట్రానికి పునాది ఆర్టీసీ అని అన్నారు. ఉద్యోగులు మేడారం జాతర కోసం చాలా కష్టపడ్డారని ప్రశంసించారు. ఆర్టీసీని నష్టా ల్లో నుంచి లాభాల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. పెండింగ్ బిల్స్ పై త్వరలో సానుకూల నిర్ణయం ఉంటుం దన్నారు. 

ALSO READ :- Maidaan Trailer Review: తెరపైకి మరో స్పోర్ట్స్ డ్రామా..చక్ దే ఇండియా తరహాలో మైదాన్

ఎలక్షన్స్ కోడ్, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మహాలక్ష్మి స్కీమ్, వర్క్ లోడ్ కారణంగా ఆర్టీసీ బకాయిలపై నిర్ణయాలు ఆలస్యమౌతున్నాయని చెప్పారు. మహిళా ఉద్యోగులకు మహాలక్ష్మి పథకం పేరు మీద అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే కార్మికులకు రూ.280 కోట్ల బాండ్స్ సీఎం ప్రకటించారని, రెండు మూడు రోజుల్లో పేమెంట్స్ రిలీజ్ చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు. మహాలక్ష్మిస్కీమ్ తో ఆర్టీసీ కళకళలాడుతోందని తెలిపారు.