ఆర్టీసీకి, మెట్రోకి సంబంధమే లేదు... మంత్రి పొన్నం ప్రభాకర్​

ఆర్టీసీకి, మెట్రోకి సంబంధమే లేదు... మంత్రి పొన్నం ప్రభాకర్​
  • మహిళలకు ఫ్రీ బస్ .. పీఎం జీర్ణించుకోలేకపోతుండ్రు
  • ప్రధాని స్థాయి దిగజార్చవద్దు

హైదరాబాద్: ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.‘మహిళలు ఫ్రీ బస్​జర్నీ చేయడాన్ని పీఎం జీర్ణించుకోలేకపోతున్నరు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వాస్తవంగా ఆర్టీసీకి, మెట్రోకి సంబంధం లేదు. ఇప్పటికీ కూడా మెట్రోలో బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నం.

ప్రధానమంత్రి రాజకీయ లబ్ధి కోసమే ఆలోచన చేస్తున్నరా? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతం. పీఎం మహిళలకు బస్సు సౌకర్యంపై ఆడిపోసుకోవడం బంద్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగజార్చవద్దు’ అని సూచించారు