ప్రపంచ దేశాలతో పోటీగా.. తెలంగాణ అభివృద్ధి చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రపంచ దేశాలతో పోటీగా.. తెలంగాణ అభివృద్ధి చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నామన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.  ఆదివారం (డిసెంబర్7) భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్  ఏర్పాట్లను పరిశీలించిన పొన్నం.. దేశ, విదేశాలనుంచి నేతలు ప్రతినిధులు వస్తున్నారు..ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.  

భారత్ ఫ్యూచర్ సిటీలో డిజిటల్ టన్నెల్, సెషన్ హాల్ లను పరిశీలించిన మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ఆర్టీసీలో మొదటి తరం అల్బేన్ ఎలక్ట్రిక్ బస్సును ఆసక్తిగా తిలకించారు. ఆర్టీసీ అభివృద్ధికి చిహ్నంగా ఈ బస్సును ప్రదర్శనలో ఉంచారు. 

గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ వైపు చూస్తు్న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆర్ ఎండ్ బీ  స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా  శాఖ అధికారులు పాల్గొన్నారు.