2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ఆధారంగానే 42 శాతం బీసీ రిజర్వేషన్ : మంత్రి పొన్నం

2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ఆధారంగానే 42 శాతం బీసీ రిజర్వేషన్ : మంత్రి పొన్నం

2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ఆధారంగానే బీసీలకు  42 శాతం  రిజర్వేషన్ కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్డినెన్స్ తీసుకొచ్చే రైట్ ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఆర్డినెన్స్ కు ,శాసన సభకు సంబంధం లేదన్నారు పొన్నం.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్లపై ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని..చెప్పినట్లు అధికారంలోకి వచ్చాక  బీసీల రిజర్వేషన్ల కోసం చర్యలు చేపట్టామన్నారు. కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని కులగణన చేశాం..42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం..  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ నేతలు వ్యతిరకిస్తున్నారా?  బీసీ బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించట్లేదు.  బీజేపీ బీసీ నేతను  రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఒక రెడ్డికి అప్పగించింది.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది.  బీసీ బిల్లు ఆమోదింపజేసే బాధ్యత బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఉంది.  రాష్ట్రపతితో బిల్లు ఆమోదింపజేసి చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చించాలి. రాష్ట్ర మంత్రివర్గం,అఖిలపక్షం డిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని కులగణన కూడా నిర్వహించాం..చెప్పినట్లు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అని అన్నారు.

ALSO READ : హైదారాబాద్ ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తేవాలని జులై 10న జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిని బీఆర్ఎస్, బీజేపీ అభ్యంతరం చెబుతున్నాయి. ఆర్డినెన్స్ కు చట్టబద్ధత ఉండదని..దాని వల్ల ఒరిగేదేం లేదని బీఆర్ఎస్ చెబుతోంది.  కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు.