- ఒక్కసారిగా రూ. 304 కోట్లు విడుదల
హుస్నాబాద్, వెలుగు: 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళా స్వయం సహాయక సంఘాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వం వడ్డీ లేని రుణాలురూ. 304 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన 7 మండలాల మహిళా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
మొత్తం 5,329 మహిళా సంఘాలకు రూ. 5 కోట్ల 66 లక్షల 16 వేల చెక్కులను అందజేశారు. వీటిలో కోహెడ మండలం అత్యధికంగా రూ. 1.18 కోట్లు పొందింది. కార్యక్రమంలో డీఆర్డీవోలు జయదేవ్ ఆర్య, శ్రీధర్, అడిషనల్ డీఆర్డీవోలు రవి కుమార్, వెంకటేశ్, మహిళలు పాల్గొన్నారు.
మహిళా సాధికారతతోనే అభివృద్ధి: మంత్రి దామోదర
పుల్కల్: మహిళా సాధికారతతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సూల్తాన్‌పూర్ గ్రామ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. పావలా వడ్డీ రుణాలను ప్రవేశపెట్టిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అన్నారు.
గత ప్రభుత్వం పదేళ్లు పాలించినా మహిళా సంఘాలను మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను తిరిగి ఆర్థికంగా బలపరుస్తోందన్నారు. మహిళ సమాఖ్య సభ్యులు జాతీయ రహదారుల వెంట ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ భూముల్లో వ్యాపారాలు చేపట్టేందుకు లోన్ అవకాశాలు అందిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ మాధురి, డీఆర్డీవో పీడీ జ్యోతి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పెరిష, వివిధ మండలాల మహిళా సమాఖ్య అధ్యక్షులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దశరథ్, కాంగ్రెస్ నాయకులు రాంచంద్రారెడ్డి, మల్లారెడ్డి, గోవర్దన్, ఈశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.
పేదల పక్షపాతి ప్రభుత్వం : ఎమ్మెల్యే రోహిత్
పాపన్నపేట: పేదల, రైతుల పక్షపాత ప్రభుత్వం తమదని ఎమ్మెల్యే రోహిత్అన్నారు. పాపన్నపేట మండలం పొడిచన్పల్లి రైతు వేదికలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలతో మహిళల్లో ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం పెరుగుతాయన్నారు. మహిళలు ఒకేపనికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు.
అడిషనల్ కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ వడ్డీ లేని రుణాల కింద జిల్లాకు రూ.30.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో విష్ణువర్ధన్, ఎంపీఓ శ్రీశైలం, ఏపీఎం రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద నాయక్ పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని 3083 డ్వాక్రా గ్రూప్ మహిళలకు రూ.3 కోట్ల 4 లక్షల వడ్డీలేని రుణాల చెక్కులను సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం స్వయం సహాయక బృందాలను నిర్వీర్యం చేసిందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నారన్నారు. శంకరంపేట మండల పరిధిలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు హసీనాబేగం, నాగమణి, ఐకేపీ ఏపీఎంలు సాయిలు, వంశీకృష్ణ, శంకుతల, నర్సింలు, సరిత, అనంతయ్య, సిబ్బంది రాములు, సంతోష్ పాల్గొన్నారు.
గిరిజన మహిళకు కార్ లోన్.. తాళాలు అందజేసిన ఎంపీ సురేశ్ షెట్కార్
జహీరాబాద్: డీఆర్డీఏ, సెట్విన్ శిక్షణ కేంద్రంసంయుక్తంగా నిర్వహించిన డ్రైవింగ్శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన గిరిజన మహిళకు ఎంపీ సురేశ్ షెట్కార్ కారు తాళాలను అందజేశారు. జహీరాబాద్ లోని ఎస్వీ ఫంక్షన్ హాల్ లో డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మండలంలోని శేఖపూర్ గ్రామ పరిధిలోని జమాలా తండాకు చెందిన మెగావత్ లక్ష్మీ బాయి, డీఆర్డీవో నిర్వహించిన శిక్షణ కేంద్రంలో డ్రైవింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆమెకు ఉపాధి కోసం ట్రైబల్ వెల్ఫేర్ ట్రైకర్స్కీం కింద కారు కోసం రూ.5 లక్షల సబ్సిడీ మంజూరైంది. సబ్సిడీ పోను కారుకు సంబంధించిన సొమ్మును కెనరా బ్యాంకు మంజూరు చేసింది. ఎంపీ మాట్లాడుతూ మహిళలు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు.
మహిళల ఎదుగుదలకు ప్రభుత్వం అండ: కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్ : మహిళల ఎదుగుదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఎస్ ఎస్ జీ గ్రూపులకు టీజీఐఐసీ చైర్పర్సన్నిర్మల జగ్గారెడ్డితో కలిసి రూ.314.31 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుంటే వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనంతో పాటు దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
వ్యాపార రంగంలో మహిళలను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తుందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ జ్యోతి, అడిషనల్డీఆర్డీవో వో సూర్యారావు, ఆత్మ కమిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, మండల సమైక్య అధ్యక్షురాలు జ్యోతి, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్ రాహుల్ రాజ్
నర్సాపూర్ : మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం అని కలెక్టర్ రాహుల్రాజ్అన్నారు. నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ రైతువేదికలో ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి మహిళలకు రూ.8 కోట్ల 80 లక్షల వడ్డీలేని రుణాల చెక్కులను అందజేశారు. గ్యాస్ సబ్సిడీ రూ.13 కోట్ల ను అందించినట్టు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వేగంగా జరిపి రూ.329 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు.
సన్నాలకు రూ.11 కోట్ల బోనస్ అందించామన్నారు. 22 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరుచేసినట్లు చెప్పారు. జిల్లాలో 9 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని వెల్లడించారు. ఎమ్మెల్యే సునీతా రెడ్డి మాట్లాడుతూ మహిళలకు వడ్డీ లేని రుణాలను రూ.20 లక్షల వరకు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, ఆర్డీవో మైపాల్ రెడ్డి పాల్గొన్నారు.
