- మంత్రి పొన్నం.. అసెంబ్లీలో శివుడి ఫొటో ప్రదర్శన
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో శనివారం ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఉదయం సభ ప్రారంభంకాగానే మంత్రి పొన్నం ప్రభాకర్ శివుడి ఫొటో ప్రదర్శించారు. శివుడి కుటుంబంలోనే ఎన్నో వైరుధ్యాలుంటాయని తెలిపారు. నెమలికి పాముకు పడదని.. అలాగే, ఎద్దుకు సింహానికి పడదని చెప్పారు. కానీ వారంతా కలిసి ఒక పరివారంగా ఉంటారని చెప్పారు. బీసీల సమస్యలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంత వైరుధ్యం ఉన్నా, ఎన్ని అంశాలున్నా.. శివుడి కుటుంబంలా సభ్యులంతా కలిసి మెలిసి ఉండాలని సూచించారు.
బీఆర్ఎస్ సభ్యులతో గూడెం మహిపాల్ రెడ్డి
అసెంబ్లీలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేటాయించిన రోలో కూర్చున్నారు. ఆయన బీఆర్ఎస్ సభ్యులతో కలిసి మాట్లాడటం.. వారితో కూర్చోవడం చర్చనీయాంశమైంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తర్వాత కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారు.
