హైదరాబాద్​ : నాంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ.. భవిష్యవాణి స్వర్ణలతకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇల్లు కేటాయింపు

హైదరాబాద్​ :  నాంపల్లిలో  ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ.. భవిష్యవాణి స్వర్ణలతకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇల్లు కేటాయింపు

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాంపల్లి భోగుట్టలోని  515 మంది లబ్ధిదారులకు శనివారం నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,  మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలసి మంత్రి పొన్నం ప్రభాకర్ డబుల్​బెడ్​రూమ్​ఇండ్ల పట్టాలు అందజేశారు . ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. పట్టాలు అందుకున్న ప్రతి ఒక్కరికి త్వరలోనే  ఇండ్లు అందజేస్తామన్నారు. 

భవిష్యవాణి స్వర్ణలతకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇల్లు 

పద్మారావునగర్: ఆషాడ మాస బోనాలులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించే రంగంలో భవిష్యవాణి వినిపించే అడ్డగుట్టకు చెందిన మాతంగి కన్య అరుపుల స్వర్ణలతకు ప్రభుత్వం మారెడుపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసింది. ఆ ఇంటికి సంబంధించిన పట్టాను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్​లో అందజేశారు. బీఆర్ఎస్ హయాంలో స్వర్ణలతకు ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించగా, దాదాపు ఏడాది పాటు అధికారుల చుట్టూ తిరిగినా ఆమె సొంతింటి కల నెరవేరలేదు. ఇటీవల స్పందించిన కాంగ్రెస్​ప్రభుత్వం ఆమెకు డబుల్ బెడ్​ రూమ్ ఇంటిని కేటాయించింది.