చెట్లను చంపుకుంటే మనల్ని మనం చంపుకున్నట్టే

చెట్లను చంపుకుంటే మనల్ని మనం చంపుకున్నట్టే

కామారెడ్డి : చెట్లను పెంచుకుంటే మన పిల్లల్ని పెంచుకున్నటేన‌ని, చంపుకుంటే మనల్ని మనం చంపుకున్నట్టేన‌ని అన్నారు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి . గురువారం కామారెడ్డి జిల్లాలో నిర్వ‌హించిన హరిత హారం కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా సీఎం కేసీఆర్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశార‌న్నారు. గత 5 సంవత్సరాలుగా హరిత హారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా తీసుకుపోతున్నారని చెప్పారు. గతంలో అటవీ శాఖ అధికారులు మాత్రమే మొక్కలు నాటే వారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుతంలోని అన్ని శాఖలు మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.

హ‌రిత‌హారం కోసం కేవలం కామారెడ్డి ఒక్క జిల్లాకే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ను కలుపుకుని మొదటి సంవత్సరం 80 కోట్లు, రెండవ సంవత్సరం 40 కోట్ల రూపాయలను ప్ర‌భుత్వం ఖర్చు చేస్తున్న‌ద‌ని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా హరిత హారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు.‌