దేశంలో ఎక్కడా ఇటువంటి కార్యక్రమం లేదు

దేశంలో ఎక్కడా ఇటువంటి కార్యక్రమం లేదు

సీఎం కేసిఆర్ మేధోమథనం నుంచి పుట్టిందే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు. పల్లెలు, పట్టణాలు బాగు చేసుకోవడానికి ఇది గొప్ప ప్రణాళికన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఆదర్శవంతమైనా కార్యక్రమం లేదని చెప్పారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా గ్రామ, పట్టణాలకు తమ ప్రభుత్వం నిధులు ఇస్తుందని తెలిపారు. ఇట్లా అదనపు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పుకొచ్చారు మంత్రి.

సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు జూన్ 3 నుంచి 18 వరకు 4వ విడత పల్లె ప్రగతి, 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఇందులో ప్రధాన భూమిక పోషించాలని మంత్రి సూచించారు. కేసిఆర్ ముందు చూపు వల్ల రాష్ట్రంలో 7.5 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. ఇది ఓట్ల కోసమో, రాజకీయం కోసమో చేస్తున్నది కాదని..భవిష్యత్ తరాలకు మంచి చేయడం కోసమేనని వివరించారు. 

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు మంత్రి వేముల. గ్రామాల్లో క్రీడలను ప్రోత్సాహంచడం కోసం మండలానికి రెండు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడా మైదానాల డెవలప్మెంట్ కోసం 50 వేల రూపాయలను ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలిపారు. జూన్ 3వ తేది లోపు గత ఏడాది ప్రణాళికలో మిగిలిన పనులపై అవగాహన చేసుకుని వాటిపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

మరిన్ని వార్తల కోసం

ప్రభుత్వ ఆఫీసుల్లో రూ.17 వేల కోట్ల కరెంట్ బకాయిలు..!

పంటల సాగు, ఎగుమతిలో దేశం ఇంకా వెనకబడే ఉంది