
సీఎం జగన్ పాలనలో ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి ఆర్కే రోజా. రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంటే చంద్రబాబు, లోకేశ్ ఓర్వడం లేదని ఫైర్ అయ్యారు. చిన్నపిల్లలతో టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఫైయిల్ అయిన విద్యార్ధులతో జూం మీటింగ్స్ పెట్టి డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబుకు కష్టమొస్తే పవన్ కళ్యాణ్ బయటకొస్తారన్నారు. తెలంగాణలో భూస్థాపితమైన టీడీపీ.. ఏపీలో కూడా క్లోజ్ అవ్వడం ఖాయమన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించున్న రోజా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.