కేసీఆర్ దయవల్లే జిల్లా కేంద్రం ఏర్పడింది

కేసీఆర్ దయవల్లే జిల్లా కేంద్రం ఏర్పడింది

సీఎం కేసీఆర్ దయవల్లే వికారాబాద్ జిల్లా కెంద్రం ఎర్పడిందని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శుక్రవారం వికారాబాద్ పట్టనంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సబిత… వికారాబాద్ అభివృద్ధి చెందితే చుట్టుపక్కల నియోజక వర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. వికారాబాద్ అనంతగిరిని టూరిస్ట్ స్పాట్ గా ఏర్పాటు చేయడం కేసీఆర్ కళ అని.. అందుకోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేయనున్నారని చెప్పారు.

సమావేశానికి వచ్చిన ప్రతి వ్యక్తి 15 మందితో ఓట్లు వేయించేల కృషిచేయాలని మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ సత్తాచాటాలని అన్నారు సబిత. మహిళలు చిన్న పరిశ్రమలు ఎర్పాటుచేసుకునేలా సీఎం ప్రణాళికలు తయారు చేస్తున్నారని ఆమె అన్నారు. త్వరలోనే పనులు మొదలుకానున్నాయని తెలిపారు. మున్సిపల్ లోని ప్రతి నిరుద్యోగికి ఉపాదిని కల్పిస్తామని అన్నారు.. మున్సిపల్ లో వందగజల స్థలం లోపల ఉన్న నిరుపేదలకు ఎలాంటి పరిమిషన్ అవసరంలేకుడా రెండంతస్తుల వరకు ఇల్లు నిర్మించుకోవచ్చు అని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రరెడ్డితో పాటు..ఎంపీ రంజిత్ రెడ్డి, గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యేలు డా.మెతుకు అనంద్, యాదయ్య, విద్య.. మౌలిక వసతుల కల్పన చైర్మెన్ నాగేందర్ గౌడ్, జిల్లా కేంద్ర లైబ్రరి చైర్మెన్  కొండల్ రెడ్డి, జిల్లా వైస్ జడ్పీటీసి విజయ్ కుమార్ పాల్గొన్నారు.