వీసీలతో మంత్రి సబిత సమావేశం

వీసీలతో మంత్రి సబిత సమావేశం

యూనివర్సిటీల వీసీలతో సమావేశం అయ్యారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ మీటింగ్‌లో సీఎస్,ఉన్నత విద్యామండలి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ఇండస్ట్రీలకు యూనివర్సిటీల అనుసంధానం చేయాలన్నారు. వర్శిటీల్లో పరిశోధనలను పెంచాలన్నారు మంత్రి. వర్సిటీలో చదివే విద్యార్థి ఉద్యోగంతోనే బయటకు వెళ్లేల కరికులం ఉండాలన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీ లకు ధీటుగా ప్రభుత్వ వర్శిటీలు తయారు కావాలన్నారు సబిత. 

త్వరలోనే ఖాళీ గా ఉన్న  పోస్ట్‌లను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా  వర్శిటిల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కావాలని వీసీలు మంత్రిని కోరారు. వీసీలు యూనివర్సిటీల అక్టివిటీస్ పై ప్రజంటేషన్ ఇచ్చారు. కేయూ, ఓయూ, జేఎన్టీయూ, ఉన్నత విద్యా మండలిలో ఈ ఆఫీస్ ను ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 

ఇవి కూడా చదవండి:

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రదానం

వివాహ బంధంతో ఒక్కటికానున్న యంగ్ పొలిటీషియన్స్