
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జూన్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ భావిస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది. కరోన వైరస్ కారణంగా టెన్త్ పరీక్షలు నిలిపి వెయ్యాలంటూ దాఖలైన పిల్ పై హైకోర్ట్ మంగళవారం అత్యవసర విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా లాక్ డౌన్ అనంతరం అంటే జూన్ 8 తర్వాత పరీక్షలు నిర్వహించుకోవాలని కోర్ట్ ఆదేశించింది.